Site icon Ourtelugu

Pak army chief anti India speech response | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ‘భారత వ్యతిరేక’ ప్రసంగానికి దిమ్మతిరిగే జవాబు!

ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ఒక ప్రసంగం పెను దుమారం రేపింది. “మేము హిందువుల నుండి వేరు. మా లక్ష్యాలు వేరు, మా కలలు వేరు కాబట్టే మేము ఇండియా నుండి విడిపోయాం. మేము ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్ముతాం, ఇది ఏక జాతి కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.

ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియాను దూషిస్తే మనకు కోపం వచ్చేది. కానీ నేటి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి, వారి అప్పులు, వారి స్థాయి చూస్తుంటే వారి మాటలకు, వాస్తవానికి పొంతన లేదు. బాధ్యత కలిగిన ఆర్మీ జనరల్ ఇలాంటి అర్థం లేని ప్రసంగాలు చేయడం విడ్డూరంగా ఉంది.

2025లో ఎవరైనా భారతీయుడు ఈ ప్రసంగాన్ని వింటే నవ్వాలో, జాలి పడాలో తెలియని పరిస్థితి. కానీ దీనిపై మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఆయన ఇండియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏడు అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. వాటిని విశ్లేషించి, వాస్తవాలతో బదులిచ్చే ప్రయత్నం చేద్దాం.

ఇది హిందువులకు, ముస్లింలకు మధ్య యుద్ధం కాదు. పాకిస్తాన్ మతోన్మాదంతో ఏర్పడింది. కానీ భారతదేశం ఐక్యత, భిన్నత్వంపై నిలబడుతుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి ఉంటేనే భారతదేశం.

భారతదేశం, పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇక్కడ 15% హిందువులు ఉంటే ఇప్పుడు కేవలం 1.2% మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా ఏమయ్యారు? ఇలాంటి ప్రసంగాలతో మీరు నిజాలను దాచిపెట్టాలని చూస్తున్నారేమో కానీ, వాస్తవం అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎంతమంది చనిపోయారో మీకు తెలియదనుకుంటున్నారా? ఇలాంటి ప్రసంగాలు చేస్తే అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారా?

ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారతీయులకే కాదు, పాకిస్తాన్ ప్రజలకు కూడా అసిమ్ మునీర్ అంటే అంత ఇష్టం లేదు. వారికి ఇమ్రాన్ ఖాన్ అంటే అభిమానం. కానీ ఆయన జైలులో ఉన్నారు. దేశంలో ఒక రకమైన అవిశ్వాసం నెలకొంది. దీనికి తోడు పేదరికం. వారి విదేశీ మారక నిల్వలు కేవలం 4 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇది చాలా తక్కువ. ఇది అయిపోతే మళ్లీ ప్రపంచం ముందు బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది.

జనాల్లో పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్లీ నింపడానికి, కాస్త గట్టిగా మాట్లాడదామని, ఆవేశంగా ప్రసంగిద్దామని ఆయన మైక్ అందుకోగానే మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రధాని షేబాజ్ షరీఫ్, ఇతర ఉన్నతాధికారులు అక్కడ ఉన్నారు. ఆయన మొదలు పెట్టగానే ద్విజాతి సిద్ధాంతాన్ని పట్టుకున్నారు. ముస్లింలు, హిందువులు కలిసి ఉండలేరు కాబట్టే విభజన జరిగిందని, తాము హిందువులం కాబట్టే విడిపోయామని ఆయన వాదిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ ఎప్పటికీ ఒకటి కాలేవు అంటున్నారు.

ఆయన చెప్పింది నిజమే. ఇండియా, పాకిస్తాన్ ఒకటి కాదు. ఇండియా పాకిస్తాన్ అంత దిగజారలేదు. ఆ స్థాయి పతనాన్ని ఇండియా ఎప్పటికీ చూడదు. మీ దేశం మతోన్మాదంపై పుట్టిందేమో కానీ, ఇండియా బహుళత్వాన్ని గౌరవిస్తుంది. మాది బహుళ మత, బహుభాషా, సమాఖ్య ప్రజాస్వామ్య దేశం. కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి.

ఇక మీ దేశం గురించి మాట్లాడదామా?

1956లో మీ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. మైనారిటీలను సిస్టమాటిక్ గా బయటకు తరిమేశారు లేదా చంపేశారు. 15% ఉన్న హిందువులు ఇప్పుడు 1.5%కి పడిపోయారు. అహ్మదీయులను చట్టబద్ధంగా ముస్లిమేతరులుగా ప్రకటించి వారిపై దైవదూషణ చట్టాలు పెట్టారు. దీనివల్ల మీకేమి మిగిలింది? గుర్తింపు సంక్షోభం, సైనిక తిరుగుబాట్లు, హింస. కష్టపడి సంపాదించిన వ్యక్తి తన ఇంటి చుట్టూ కంచె లేకుండా బతకగలడా? లేదా మీరే ప్లాన్ చేసి జైలుకు పంపిస్తారా?

ఇక ఆర్థిక పరిస్థితి ఏమిటి?

ఇవాళ ఇండియా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాం. మాలో సమస్యలు ఉన్నాయి, అవినీతి ఉంది. కానీ దాని నుంచి మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజాస్వామ్యపు గాలి వచ్చినప్పుడు దుమ్ము కూడా వస్తుంది. ఆ దుమ్మును మేము శుభ్రం చేస్తాం. మరి మీ పరిస్థితి ఏమిటి? మా దగ్గర ఇస్రో ఉంది, చంద్రయాన్ విజయవంతమైంది, యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపులు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. మీ దగ్గర ఐఎంఎఫ్ బెయిలౌట్లు, డాలర్ సంక్షోభం, 30-35% ద్రవ్యోల్బణం. కొనడానికి డబ్బులు లేవు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? మీ దేశ పగ్గాలు రాజకీయ నాయకుల దగ్గర లేవు, మిలిటరీ దగ్గర ఉన్నాయి. ఆ మిలిటరీ వచ్చి ఇలా మాట్లాడుతుంది. కొంచెం కూడా విచక్షణ లేకుండా ఇలాంటి సమయంలో ఇండియా దగ్గరికి వచ్చి శాంతి కోరాలి మీరు. కానీ మీరు శత్రుత్వాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. ఇండియా చాలా వ్యూహాత్మకంగా, భౌగోళిక రాజకీయంగా బలపడుతోంది. మీరే మిమ్మల్ని ఒకసారి పరిశీలించుకోండి. రెమిటెన్స్‌లో మిలిటరీ లేకపోతే మీ పరిస్థితి ఏంటి? విద్యుత్ కోతలు ఉన్నాయి, చైనా ప్రాజెక్టులు కడుతోంది, భూములు లీజుకు తీసుకుంటోంది. రేపు పొద్దున్న మా నేల మాదే అంటారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలాగే ద్విజాతి సిద్ధాంతం అంటారా? మేము ఇండియా ఒకటి కాదంటారా?

మీరు చెప్పింది నిజమే.

మేము ఒకటి కాదు. మా దగ్గర కుల సమస్యలున్నా, మతపరమైన ఉద్రిక్తతలున్నా, ఉత్తర-దక్షిణ భాషా భేదాలున్నా వాటికి పరిష్కారం మేము పార్లమెంటులో వెతుకుతాం, బిల్లుల ద్వారా వెతుకుతాం, ప్రజాస్వామ్యం ద్వారా సమాధానం చూడాలనుకుంటాం. మీలా అంతర్గత తిరుగుబాట్ల వరకు తెచ్చుకోం. మీరు చెవి బయట కాదు, మీ లోపల వినండి. బలూచిస్తాన్ ఏం కోరుకుంటుందో అడగండి. పష్తూన్లు, సింధీలు, మొహాజిర్లు ఏం అడుగుతున్నారో అడగండి. వారిని ఒంటరిగా వదిలేయకండి. మీ మతోన్మాదం ఇప్పటికే మూడు మిలిటరీ తిరుగుబాట్లకు దారితీసింది. మీ ఆయువు పట్టు మిలిటరీ చేతిలో ఉంది. ఇలాంటి సమయంలో ఈ ప్రకటన అవసరమా?

ఇక ఆయన తర్వాతి ప్రకటనకు వెళ్దాం. కాశ్మీర్ పాకిస్తాన్ యొక్క ‘జగులార్ వెయిన్’ (ప్రాణనాడు) అంట! అంత వ్యూహాత్మకంగా ముఖ్యమైనదట కాశ్మీర్ వారికి! ముందు అసలు జగులార్ వెయిన్ అంటే ఏమిటో తెలుసా? మెడ దగ్గర ఉండే ఒక ముఖ్యమైన రక్తనాళం. దానితో కాశ్మీర్‌ను పోలుస్తున్నారు. కాశ్మీర్‌పై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. అది మా ప్రాణనాడు. ఇది ఆయన మొదటిసారి అనడం కాదు. జుల్ఫికర్ అలీ భుట్టో కూడా ఇదే అన్నారు. ఇది ఎంత నవ్వు తెప్పిస్తుందంటే! ఈ చర్చంతా వద్దు. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. చట్టపరంగా కాశ్మీర్ ఎవరిది? అక్టోబర్ 1947లో ఏం జరిగింది? ఆ రోజున రాజా హరి సింగ్ విలీన పత్రంపై సంతకం చేశారు. మేము కాశ్మీర్‌ను ఇండియాకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ గ్యాప్‌లో మీరు కొంచెం ఆక్రమించుకుని అనవసరమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతను మీరే సృష్టించుకుని ఈ నేల మాది అని ఫిక్స్ అయిపోయారు. ఇది చట్టబద్ధంగా కట్టుబడి ఉండే చర్య. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఒకసారి చదవండి. అప్పటికి పాకిస్తాన్ ఇండియాలోనే ఉంది. నిజానికి కొన్ని వందల సంవత్సరాలుగా మేమంతా కలిసి ఉన్నాం. కొత్తగా ఈ 80 సంవత్సరాల్లో ఏం మారిపోయింది? మీ దేశపు భావజాలం మారింది అంతే. భారతదేశం మారలేదు. మీరు చేసింది చొరబాటు. కాశ్మీర్ భారతదేశానిది. అది మీ బుర్రలోకి ఎక్కించుకోండి, ఆలస్యం కాకముందే.

మీకు కాశ్మీర్‌పై ఎటువంటి నైతిక హక్కు లేదు. మీరు నిలబడుతున్న ఆ నేల మీది కాదు. పైగా మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మా దగ్గర ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేశాం. ఇవాళ ప్రజలు మళ్లీ బయటకు వచ్చి హాయిగా తిరగగలుగుతున్నారు. సమస్యలు ఉన్నాయి, కాదనట్లేదు. ఆ సమస్యలు మీరే సృష్టిస్తున్నారు. కానీ దాన్ని కూడా మేము ప్రజాస్వామ్యంగానే ఎదుర్కొంటున్నాం. ఆలస్యం కాకముందే పిఓకే నుంచి వెనక్కి వెళ్లిపోండి. స్టేజ్ ఎక్కి కాశ్మీర్ జగులార్ వెయిన్, ఇన్సులర్ కిడ్నీ లాంటి అర్థంలేని మాటలు మాట్లాడకండి. బాగోదు.

ఇండియన్ మిలిటరీ మమ్మల్ని ఏమీ చేయలేదనుకోకండి. మీ కళ్లారా చూశారు 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను, 2019లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌ను. మా శక్తి ఏమిటో మీకు తెలుసు. అనవసరంగా మాట్లాడకండి. ఇవాళ ఏదో భౌగోళిక రాజకీయంగా మాకు శక్తి వస్తుందని, వేరే దేశాలు మా గురించి మాట్లాడుతాయని మీరు అనుకున్నారు కదా? సెక్షన్ 370 రద్దు చేసినప్పుడు ఇవాళ యూఎస్ఏ ఏమంటోంది, సౌదీ అరేబియా ఏమంటోంది, యూఏఈ ఏమంటోంది? వారందరూ ఇండియాతో ఉన్నారు. ఇండియా చేసిందే కరెక్ట్ అంటున్నారు. నేను ఒక్కటే మాట చెప్తాను. మీరు అనుకున్నట్టు కాశ్మీర్ పాకిస్తాన్ యొక్క జగులార్ వెయిన్ అయితే, మిగతా బాడీ ఐసీయూలో ఉంది. మీ జగులార్ వెయిన్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. దాన్ని నార్మలైజ్ చేయాలంటే ఇంజెక్షన్ ఇండియా వేయాలి.

ఇక ఈ ప్రకటన వినాలి మీరు. ఇదివరకైతే కోపం వచ్చేది కానీ ఇప్పుడు చాలా కామెడీగా ఉంది. స్టేజ్ మీద మైక్ ముందు పెట్టుకుని 1.3 మిలియన్ల భారతీయ సైన్యం ఇన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్‌ను ఏమీ చేయలేకపోయిందట! ఇక ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారు పాకిస్తాన్‌ను అని అడుగుతున్నారు ఆయన. ఏ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆ ఉగ్రవాదం ఎక్కడ మొదలైంది? వారికి పాలుపోసి పెంచింది ఎవరు? నిధులు తెచ్చింది ఎవరు? రకరకాల పేర్లు పెట్టి స్కూళ్లలో అభివృద్ధి చేసింది ఎవరు? చిన్న చిన్న పిల్లలను తెచ్చి శిక్షణ ఇస్తుంది ఎవరు? మీ దేశపు పిల్లలకు ఇండియా మీద ద్వేషాన్ని పెంచుతుంది ఎవరు? మీకు డబ్బు, పలుకుబడి, ఆస్తి ఉంటే మిలిటరీలో చేరండి. ఏమీ లేకపోయినా టెన్షన్ లేదు, లష్కరే తోయిబా లాంటి స్కూల్ ఒకటి మేము పెట్టాం, ఆ స్కూల్లో చేరండి, బందూకులు ఎలా కాల్చాలో నేర్చుకోండి, బోర్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీని ఆర్మీని ఇరిటేట్ చేయండి అని పుష్ చేస్తున్నది ఎవరు అది మీరు కాదా ఇవాళ వచ్చి బలచిస్తాన్ లో ఇన్సర్జెన్సీ జరుగుతుంటే వాళ్ళు మా నేలను మాకు ఇచ్చేయండి అని అడుగుతుంటే మీరు వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నారు మీరు ఆ కోపాన్ని ఇండియా మీద చూపిస్తున్నారు కానీ ఇండియన్ ఆర్మీ గురించి మీకన్నా బెటర్ గా ఎవరికైనా తెలుసా చెప్పండి

Exit mobile version